బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ని చంపేస్తామంటూ బెదిరింపు కాల్ రావడం ఇటీవల సంచలమైన సంగతి తెలిసిందే. అయితే ఆ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని తాజాగా ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
రూ.50 లక్షలు ఇవ్వకపోతే షారుఖ్ ఖాన్ ని చంపేస్తానంటూ ముంబై పోలీసులకు ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేపట్టి, అతనిని ఛత్తీస్గఢ్ కి చెందిన ఫైజాన్ ఖాన్ గా గుర్తించారు. మంగళవారం ముంబై వెళ్లిన పోలీసులు, అక్కడ ఫైజాన్ ను అరెస్ట్ చేశారు.
అయితే ఫైజాన్ మాత్రం తాను బెదిరింపులకు పాల్పడలేదని చెబుతున్నాడు. కొద్దిరోజుల క్రితం తన మొబైల్ పోయిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానని అంటున్నాను. అంతేకాదు, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా షారుఖ్ వ్యాఖ్యలు ఉన్నాయని గతంలో తాను ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, అందుకే ఇప్పుడు తనని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఫైజాన్ చెప్పుకొచ్చాడు. కొసమెరుపు ఏంటంటే ఫైజాన్ లాయర్ కావడం విశేషం.